![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -331 లో..... దీప చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అవ్వడంతో బుల్లెట్ సరాసరి దశరథ్ గుండెల్లో గుచ్చుకుంటుంది. వెంటనే శివన్నారాయణ వాళ్ళు ఆతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. దీప ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు.
కార్తీక్ ని చూడగానే అందరు మండిపడతారు. మావయ్యకి ఇప్పుడు ఎలా ఉందని కార్తీక్ అడుగగానే.. ఎందుకు వచ్చావ్ రా అంటూ శివన్నారాయణ కోప్పడుతాడు. ఎందుకు వచ్చావ్ రా తప్పు చేసింది దీప కాదు.. నువ్వే అసలు అన్నింటికి కారణం నువ్వే అని సుమిత్ర అంటుంది. దీప షూట్ చేస్తే బావని అంటావ్ ఏంటని జ్యోత్స్న అంటుంది. తప్పంతా నీదేరా నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టి ఉంటే పరిస్థితిలు వేరేలా ఉండేవి అని సుమిత్ర అంటుంది. దీప ఎలాంటిదో నాకంటే బాగా నీకే తెలుసు అత్తయ్య అని కార్తీక్ అంటాడు. అయిన కార్తీక్ మాట వినిపించుకోకుండా అందరు కార్తీక్ ని తిడుతారు.
నాకు కొడుకుకి ఏమైనా అయితే ప్రాణానికి ప్రాణం సరాసరి అని శివన్నారాయణ అంటాడు. పుట్టెడు దుఃఖంతో కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంటికి వెళ్లేసరికి శౌర్య, కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. అమ్మా ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. తనకి ఏదో ఒకటి చెప్పి లోపలికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిందంతా కాంచన, అనసూయలకి కార్తీక్ చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |